వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో నీటిపారుదలశాఖ అధికారులతో శనివారం మాట్లాడుతూ, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. జిల్లాలో పలుచోట్ల చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు పూర్తిస్థాయిలో నిండితే భూగర్భజలాలు పెరుగుతాయని, మండల కేంద్రాల్లోని చెరువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.