వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని AIUKS మండల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం దమ్మపేటలో AIUKS ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12, 000 ఆత్మీయ భరోసా ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్న అమలు చేయడం లేదని పేర్కొన్నారు.