దమ్మపేట పోలీసులు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. శనివారం వారిని అదుపులోకి తీసుకుని, 90 కిలోల కాపర్ వైర్లు, కట్టర్లు, మూడు సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఈ నిందితులు దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఈ. బయ్యారం గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల నుంచి వైర్లు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.