చండ్రుగొండలో 10న డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఈనెల 10న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం తెలిపారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఈ గ్రామంలో పోడుభూములకు పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇందిర గిరి సౌర వికాసం అనే నూతన పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంప్ సెట్లు బోర్లు మోటార్లు పంపిణీ చేయనుంది.

సంబంధిత పోస్ట్