దమ్మపేటలో రూ 53, 50, 000తో అభివృద్ధి పనులు

దమ్మపేట మండలం వడ్లగూడెం ముష్టిబండ గ్రామపంచాయతీలలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పాల్గొన్నారు. అనంతరం దళిత వాడల అభివృద్ధి కోసం ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా రూ. 53, 50, 000 మంజూరైన 14 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్