ఎమ్మెల్యే జారె చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలో, దమ్మపేట మండలం పార్కలగండి, పట్వారిగూడెం, అంకంపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. హర్‌ఘర్ జల్ కార్యక్రమంలో పాల్గొని నీటి పొదుపు, పరిశుభ్రత, సురక్షిత మంచినీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే జారె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕