పరీక్షలో డమ్మీ అభ్యర్థి: ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో పదో తరగతి పరీక్షలో డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించిన కేసులో మంగళవారం తీర్పు వెలువడింది. కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి ఇద్దరు నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2019 నవంబర్ 4న లిటిల్ బర్డ్స్ పాఠశాలలో తెల్లం అనిల్ స్థానంలో పూనెం సందీప్ పరీక్ష రాస్తుండగా స్క్వాడ్ పట్టుకుంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి ఈ శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్