దమ్మపేట ఆదివాసీ సంక్షేమ పరిషత్ నూతన కమిటీ ఎన్నిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో బుధవారం దమ్మపేట మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్ దొర ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కొర్సా వీధరాజు మండల అధ్యక్షుడిగా, పెనుబల్లి రమేష్ ప్రధాన కార్యదర్శిగా, చాప నాగరాజు కోశాధికారిగా, గుండి నాగరాజు ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆదివాసీ హక్కులు, చట్టాలు, జీవోలను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు వీధరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కురసం చిన్నరాజు, తాటి చందర్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕