భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని ప్రకటించి, అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పూరిళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దమ్మపేట మోడల్ కాలనీ నీటమునిగిన నేపథ్యంలో బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు.