హైదరాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ భూములను పరిరక్షించి, రైతుల ప్రయోజనాలకు వినియోగించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటకు చెందిన ఆయిల్‌పామ్ రైతులు సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అజామాబాద్‌లోని సుమారు 15,984.50 చదరపు గజాల భూమిని TGOILFED ఆధీనంలోనే కొనసాగించాలని, ప్రైవేటు ప్రయోజనాలకు కేటాయించకుండా ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి వినియోగించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో తుంబూరి ఉమామహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, కారం శ్రీరాములు, చెలికాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.