భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలంలో సోమవారం నాడు, బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ మెంబర్లు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మల్లాయిగూడెం, రామన్నగూడెం, అనంతారం, గాండ్లగూడెం(తండా) పంచాయతీలలో బాణోతు అనూష దేవి, కునుసోతు నవీన్ నాయక్, నారం ముత్తమ్మ నామినేషన్లు దాఖలు చేసినట్లు పార్టీ నాయకులు మందపాటి రాజా మోహన్ రెడ్డి, బరగడ కృష్ణ తెలిపారు. వీరితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా తరలివచ్చారు.