భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని మందలపల్లి వద్ద సోమవారం రాత్రి ఆంధ్ర ప్రదేశ్ నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా వస్తున్న ఇసుక లారీని దమ్మపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లిపల్లి గ్రామానికి చెందిన రాజేష్, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రంగరాయ కాలనీకి చెందిన షేక్ నాగ, షేక్ ఇస్మాయిల్ పై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.