భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, దమ్మపేట రేంజ్‌లోని అంకంపాలెం బీట్‌లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 7.05 లక్షల విలువైన 5.235 క్యూబిక్ మీటర్ల టేకు కలపను జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. అనుమతులు, చట్టబద్ధ పత్రాలు లేకుండా కలప కొనుగోలు, నిల్వ, రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.