మురుసు తుఫాన్ ప్రభావం.. దమ్మపేటలో కుండపోత వర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మురుసు తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఒక్కరోజే 165 మి.మీ భారీ వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వాగులు, కాలువలు దాటే ప్రమాదకరమైన ప్రయత్నాలు చేయవద్దని మండల తహసీల్దార్ మరియు రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕