భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోగల భూములను అటవీ శాఖ నుంచి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గురువారం భద్రాద్రి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారి వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. కలెక్టర్‌కు సమస్యను వివరించి పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.