భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టాలకు విరుద్ధంగా ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేయడాన్ని నిలిపివేయాలని గోర్ బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నాయక్ డిమాండ్ చేశారు. జూలూరుపాడులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గిరిజనేతరులు తెల్లకాగితాలపై భూములు రాయించుకొని పట్టాల కోసం దరఖాస్తు చేస్తున్నారని, వాటిని తిరస్కరించాలని కోరారు.