అన్నపురెడ్డిపల్లిలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఆగమ శాస్త్రానుసారంగా జరిగిన ఈ మహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరై కలశాభిషేకం, విశేష పూజలు, అర్చన కార్యక్రమాలలో పాల్గొన్నారు.