అశ్వారావుపేటలో ఎమ్మెల్యే విసృత పర్యటన

అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం విసృతంగా పర్యటించారు. ముందుగా నారాయణపురంలో కాంగ్రెస్ నాయకులు చందా సతీష్ గుండెపోటుతో మరణించగా, వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం జమ్మిగూడెంలో గణపా చంద్రయ్య, కోన వెంకటలక్ష్మి దశదిన కార్యక్రమాలలో పాల్గొని వారి  చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అలాగే, నిర్మాణం చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్