అండర్-20 కబడ్డీ పోటీల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో అక్టోబర్ 10 నుంచి 12 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అండర్-20 బాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల వాల్ పోస్టర్‌ను ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులు శుక్రవారం ఆవిష్కరించారు. 33 జిల్లాల అండర్-20 బాలికా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీలు వేదిక కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అండర్-20 కబడ్డీ పోటీల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕