భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో కొత్త రామాలయం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ లడ్డూ వేలం ఆదివారం రికార్డు స్థాయిలో రూ.2,06,000లకు పాట పాడగా బచ్చు సత్యనారాయణ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులు మల్లికార్జునరావు వెల్లడించారు.