పాఠశాల ప్రహరీ గోడ పనులను పర్యవేక్షించిన మూడ్ బాలాజీ నాయక్

చంద్రుగొండ మండలం, వెంకటియ తండ UPS పాఠశాలలో జరుగుతున్న ప్రహరీ గోడ, గేట్ నిర్మాణ పనులను బుధవారం గిరిజన విద్యార్థి సంఘం (GVS) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మూడ్ బాలాజీ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా, గేట్‌ను రివర్స్‌గా అమర్చారని, తుప్పు పట్టిన ఇనుమును వాడారని ఆయన ఆరోపించారు. ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్, AEపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్