గ్రామపంచాయతీ ఎన్నికలు–2025 నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య సోమవారం ములకలపల్లి మండలంలోని మాదారం, కమలాపురం, ముకమావిడి, సీతాయిగూడెం గ్రామాలను, పలు గ్రామపంచాయతీలను సందర్శించారు. ప్రతి నామినేషన్ కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియ, ప్రజల రద్దీ, భద్రతా ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. అధికారులు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.