ములకలపల్లి మండలంలో గురువారం చేపల వేటకు వెళ్లి తానం రాజేష్ (22) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. రాజేష్, గడ్డం సతీష్ కలిసి గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని మూకమామిడి ప్రాజెక్టు వద్దకు చేపలు పట్టడానికి వెళ్లారు. గాలానికి చిక్కిన చేపను తీసుకురావడానికి వెళ్లిన రాజేష్ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ప్రాజెక్టులో చీకటి పడేంత వరకు గాలించినా అతని ఆచూకీ లభించలేదు.