ములకలపల్లి మండలంలో గురువారం కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పాతగుండాలపాడు, కమలాపురం పంచాయతీల పరిధిలోని చలమన్ననగర్లలో కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 10 పందెం కోడి పుంజులు, రూ. 19 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.