ములకలపల్లి: షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

ములకలపల్లి తుమ్మలకుంటకు చెందిన వగెల రాజా వ్యవసాయం చేస్తూ పూరింట్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం అతని ఇంట్లో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇంట్లోని సామగ్రిని కొంత బయటకు తీశారు. మంటలు ఇతరుల ఇళ్లకు వ్యాపించకుండా అదుపుచేశారు. ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు కాలిపోగా, ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.

సంబంధిత పోస్ట్