భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో బి. రవీందర్రెడ్డి, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజల నుంచి మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో 5 రెవెన్యూ, ఒకటి హౌసింగ్, మరొకటి విద్యుత్ సమస్యకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.