రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనున్న సాయి వినీల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన సాయి వినీల, ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసి, రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు, మున్నూరు కాపు సంఘం నాయకులు, గ్రామస్తులు వినీల, ఆమె కుటుంబ సభ్యులను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి, కాంగ్రెస్ నాయకులు, సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕