భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మల్లారం కాలనీ సమీపంలోని యార్లగడ్డ భాస్కరరావు కాలనీవాసుల దశాబ్దాల విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిష్కారం చూపారు. విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు లేక రాత్రివేళ ఇబ్బందులు పడుతున్న కాలనీవాసుల వినతి మేరకు, నూతన విద్యుత్ లైన్, వీధిదీపాలను మంజూరు చేయించి, ఆదివారం స్వయంగా ప్రారంభించారు. దీంతో కాలనీలో రాత్రివేళ వెలుగులు అందుబాటులోకి వచ్చాయి. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే, సర్పంచ్ పగడాల రమాదేవి, రాంబాబులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.