విద్యార్థినులను సొంత బిడ్డల్లా చూడాలి: ఎమ్మెల్యే జారె

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజనం, వసతి, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది విద్యార్థినులను సొంత బిడ్డల్లా భావించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో బాధ్యతారాహిత్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕