భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో , దమ్మపేట మండల పరిధిలోని భూ వివాదంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ మువ్వ విజయబాబు పేరును ప్రస్తావించడాన్ని దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం తీవ్రంగా ఖండించారు. మువ్వా విజయబాబు రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక కొందరు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఐడిసి చైర్మన్ మువ్వ విజయబాబుపై వచ్చిన ఆరోపణలు అర్ధరహితమని వారు పేర్కొన్నారు.