గుంతలతో దర్శనమిస్తున్న అశ్వారావుపేట - వాగొడ్డుగూడెం రహదారి

అశ్వారావుపేట మండల కేంద్రం నుంచి వాగొడ్డుగూడెం మీదుగా వెళ్ళే ప్రధాన రహదారి గుంతలతో దర్శనమిస్తుంది. ఈ రహదారి గుండా దాదాపుగా ఇరవై గ్రామాల ప్రజలు వాహనాల ద్వారా నిత్యం రాక పోకలు జరిపిస్తు ఉంటారు. వర్షకాలంలో కురుస్తున్న వర్షాలకు నీరు ఇలా గుంతలతో చేరడం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు వారు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ రహదారి విషయమై తాము పడుతున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం కలగలేదని, దీంతో తాము వేరే రహదారి నుండి పది నుంచి పదిహేను కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తుందని, వర్షాకాలంలో ఈ సమస్య మరింత జఠిలంగా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕