కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మురుసు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. మండలంలోని అనంతారం గ్రామం వద్ద పెదవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎడతెరపి లేని భారీ వర్షలతో వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. మరి ముఖ్యంగా పంట పొలాలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ ఎడతెరిపి లేని వర్షాలకు రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంబించిందని, విద్యుత్ సరఫరాకు కూడ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కావున అధికారయంత్రంగా వెంటనే స్పందించి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.