భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో వివాహ వేడుక జరుగుతుండగానే, బీఎల్‌ఓ నూతన వరుడికి ఓటరు నమోదు/సవరణ దరఖాస్తును కల్యాణ వేదికపైనే అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ వివరాలు నమోదు చేసి ఫారాన్ని బీఎల్‌ఓకు అందించారు. ఈ వినూత్న ఘటనను స్థానికులు అభినందించారు. ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.