భద్రాచలం: ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కమాండర్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెద్ద గల్లూరు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కమాండర్ ఉదయ్ సింగ్ మృతి చెందినట్లు సమాచారం. డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఘటనా స్థలం నుండి భద్రతా దళాలు ఒక ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్