గోదావరిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం సమీపంలోని చర్ల మండలం వీరాపురం గోదావరిలో వరద ప్రవాహంలో వ్యవసాయ కూలీలు చిక్కుకుపోయారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో ఇసుకపాయకు వెళ్ళిన కూలీలు వరదలో చిక్కుకున్నారని సమాచారం. సమాచారం అందిన వెంటనే రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యలలో తాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ సిఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డిలతో పాటు స్థానిక యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕