దివ్యాంగులకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేయూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, దివ్యాంగులను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమలమర్రి మురళి, పోలిన లంక రాజు, ముమ్మినేని అరవింద్, మరియు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్