భద్రాచలం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వి. శివ నాయక్, సోమవారం, ఓ యువతిని ఉద్దేశపూర్వకంగా కొట్టి గాయపరిచిన చింతలచెరువు మధు అనే వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2025 మార్చి 8న మిరియాల సృజన అనే యువతిపై మధు దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు.