భద్రాచలం పట్టణంలో శనివారం రాజుపై శివ దాడి చేసి గాయపరిచిన ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాజును శివ అకారణంగా దూషించి, దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజు ఫిర్యాదు మేరకు శివపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.