వేసవి దృష్ట్యా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ వైద్యులను ఆదేశించారు. బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి, జనరల్, మెటర్నిటీ, పీడియాట్రిక్ వార్డుల్లో వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ కట్టడికి కృషి చేస్తూనే, ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.