భద్రాచలం పట్టణంలో ఓ మహిళను విజయనగరానికి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని, ఈ ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. బాధితురాలు తనను ఆ వ్యక్తి అన్ని విధాలుగా వేధిస్తూ భయపెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.