భద్రాచలంలో వైద్యం కోసం వచ్చిన ఓ నవవధువు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఎటపాక రామగోపాలం తండాకు చెందిన బానోత్ నాగమణికి ఈ నెల 1న వివాహం జరిగింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను బంధువులు ఈ నెల 27న భద్రాచలం తీసుకురాగా, 28న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులకు చూపించే సమయంలో అదృశ్యమైంది. బంధువు చాందిని ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.