ఛత్తీస్గఢ్ అటవీ శాఖ మంత్రి కేదార్ కశ్యప్ ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కోరుతూ స్వామివారిని ప్రార్థించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు స్వీకరించారు.