భద్రాచలం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 9 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 2.87 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.