భద్రాచలం: రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్