భద్రాచలం: ఏసీబీ కి చిక్కిన ఎఫ్డిఓ, డిఆర్ఓ

భద్రాచలం అటవీ శాఖ ఎఫ్డిఓ సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్ఓ కృష్ణయ్యలు రోడ్డు నిర్మాణంలో చెట్లు దెబ్బతినడంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసి, గురువారం రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయని, ఈ విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండటానికి ఈ లంచం అడిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్