భద్రాచలం: బాలిక మిస్సింగ్ కేస్ నమోదు

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న ఆశ్వాపురం గ్రామానికి చెందిన బాలిక అదృశ్యంపై మంగళవారం భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలిక 1వ తేదీ రాత్రి డ్యూటీకి వచ్చి, 2వ తేదీన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ శ్యాంప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్