భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గుతుంది. రెండు రోజుల క్రిందట 41. 3 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు 24. 50 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. అటు అవుట్ ఫ్లో 2, 81, 806 క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఎగువ నుంచి తగ్గుముఖం పట్టడంతో నీటి ప్రవాహం తగ్గుతుందని పేర్కొన్నారు.