భద్రాచలం: ఘనంగా స్నాపన మహోత్సవం

భద్రాచల రామయ్య పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నాన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. విశేష ద్రవ్యాలతో అభిషేకించిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్