భద్రాచలం: భర్తకు ఆరు నెలల జైలు

భార్యను వేధింపులకు గురిచేసిన కేసులో మహమ్మద్ మోహిన్‌కు భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయాధికారి శివనాయక్ ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. చండ్రుగొండకు చెందిన మోహిన్‌పై అతని భార్య షాహనాజ్ 2021లో భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా, విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయాధికారి ఈ శిక్ష ఖరారు చేశారు.

సంబంధిత పోస్ట్