భద్రాచలం ఐటీడిఏ పిఓ రాహుల్ గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారి కోసం కోయ భాష నేర్చుకుని, గిరిజన సంస్కృతికి గౌరవం ఇస్తున్న ఆయనకు కృతజ్ఞతగా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఒక ప్రత్యేక పాటను రూపొందించారు. ఇటీవలి రిపబ్లిక్ డే వేడుకల్లో పిఓ సాధించిన విజయాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన శ్రద్ధను కొనియాడుతూ రాసిన ఈ పాటకు చిన్నారుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది.